• అంగరంగ వైభవంగా చైతూ సమంతల పెళ్లి

  Published October 8,2017 , 1:27 PM Posted By andhra

  అంగరంగ వైభవంగా చైతూ సమంతల పెళ్లి

  ఇంత వరకు సినిమా పరిశ్రమలో  నటీనటులుగా ఉన్నవారు.. సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వారు చాలా మంది ఉన్నారు.

  ముఖ్యంగా తన తండ్రి నాగార్జున తల్లి అమలా ఎలా పెళ్లి చేసుకున్నారో అలాగే నాగచైతన్య సమంత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. 8 సంవత్సరాలు ఈ ప్రేమ బంధం కొనసాగి ఇద్దరి కుటుంబ పెద్దల ఆశీర్వాదం తో శుక్రవారం రాత్రి 11 గంటల 52 నిమిషాలు జరిగింది.

  ఆనందాలతో  ఆప్తుల  సమక్షంలో మంగళ వాయిద్యాలతో హిందూ సంప్రదాయం ప్రకారం చైతన్య సమంతల వివాహ వేడుక జరిగింది. శనివారం క్రైస్తవ మతాచారం ప్రకారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు వివాహం జరిగింది. ఈ వివాహంతో వీరిద్దరూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు

  నాగచైతన్య సమంత ఇద్దరు తమ ఫొటోస్ ని సోషల్ మీడియాలో ఈ ఫోటో లో ఓ రేంజిలో ఇద్దరూ కూడా వెలిగిపోతున్నారు. ఈ పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది.  వివాహానికి అన్ని సినిమా వర్గాల వారు కూడా వచ్చారు.

  వధూవరులిద్దరిని కూడా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమని ఆశీర్వదించారు.. ఇంకా ఫ్రెండ్స్ అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

  మంత్రి కేటీఆర్ కూడా ఇద్దరికీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ వివాహానికి ప్రముఖులతో ప్రముఖ నటులు ఇంకా దాదాపు 100 మంది ముఖ్య అతిథులు వచ్చింది. నూతనంగా వివాహమైన చైతన్య సమంత ఇద్దరిని కూడా  ఆశీర్వదించారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *