• ఓహో జగన్ దేవాలయాలకు వెళ్లడం వెనుక ఓ కారణం ఉంది.

  Published October 8,2017 , 11:24 AM Posted By andhra

  ఓహో జగన్ దేవాలయాలకు వెళ్లడం వెనుక ఓ కారణం ఉంది.

  వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చేనెల నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు ఒక సమాచారం.
  ఈ విధానంలో ఆయన చినజీయర్ స్వామీజీని కలిసి దీవెనలు పొందారు అయితే ఈ స్వామీజీ కలవడం వెనుక ఉన్న కారణం వేరే ఉందని పలువురు తెలియజేస్తున్నారు.
  మరి అదేంటో ఇంతకు తెలుసా?
  వైసిపి జగన్ కుటుంబం తన తాతల కాలం నుంచి క్రైస్తవాన్ని ఆచరిస్తుంది ఇంట్లో అన్ని పనులు మతాచారం ప్రకారమే జరుగు తున్నాయి.
  తండ్రి వైయస్ అంత్యక్రియలు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ క్రైస్తవ ఆచారం ప్రకారమే జరిగాయి. అయితే రాజకీయ నాయకులు ఏ మతాన్ని ఆచరిస్తున్నా ప్రజల్లో మాత్రం అందరి వాటిలాగే ఉండాలని జగన్ఆ బాటలో నడుస్తున్నారు.జగన్ కొంతకాలం క్రితం ఆలయాలలోకి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు మనసు మార్చుకొని ఆలయాల్లోకి వెళుతున్నారు. దైవ దర్శనం చేసుకుంటున్నారు. స్వామీజీల ఆశీస్సులు పొందుతున్నారు.

  అయితే ఈ మధ్య కాలంలో హిందువులను దగ్గర చేసుకునేందుకు జగన్ చాలా ఆలయాలు సందర్శించినట్లు సమాచారం.
  అయితే తాజాగా చిన్న జీయర్ స్వామి ని కలిసి జగన్ ఆశీస్సులు పొందారుత్వరలో చేయబోయే పాదయాత్రకు ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో స్వయంగా తెలిపారు.

  పలువురు నేతలు దీనికి కారణం వేరే ఉంది అంటున్నారుకేసులనుంచి బయటపడేందుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాగైనా బిజెపి కి దగ్గరవ్వాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అని అందులో భాగంగానే దేవాలయాలుస్వామీజీని కలుస్తూ కరుణా కటాక్షాల కోసం అభ్యర్థిస్తున్నారు.

  అదియే కాక బిజెపి అధిష్టానంలో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన స్వామీజీలను మాత్రమే జగన్ కలుసుకున్నారని తెలిపారు.
  మరి స్వామీజీల దీవెనలు ఏ విధంగా ఫలిస్తాయో చూద్దామా.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *