• గరుడ పురాణం లో చెప్పిన విధంగా నరకంలో విధించే భయంకర శిక్షలు..ఏంటో తెలుసా..?

  Published July 27,2017 , 7:46 PM Posted By andhra

  గరుడ పురాణం లో చెప్పిన విధంగా నరకంలో విధించే భయంకర శిక్షలు..ఏంటో తెలుసా..?

  ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు… ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇవిచేయకూడదా..? కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి… బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడుమాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒకరకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు.

  అంటే… తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞవిధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు… యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో తోసి వేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగచెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడపురాణం చెప్తుంది. అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే… బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోతారని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడపురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు. కానీ, గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు.

  గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం. ఈ పురాణంలో ఆచారకాండ (కర్మకాండ), ప్రేతకాండ (ధర్మకాండ), బ్రహ్మకాండ (మోక్షకాండ) అనే మూడు భాగాలున్నాయి. మొదటికాండను పూర్వఖండమనీ చివరి రెండు కాండలనూ కలిపి ఉత్తర ఖండమనీ వ్యవహరిస్తారు. ఈ కాండలొక దాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో వుంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడ పోలిక లేదు. ఆచారకాండలో 240 అధ్యాయాలు, ప్రేతకాండలో 50 అధ్యాయాలు, బ్రహ్మకాండలో 30 అధ్యాయాలు ఉన్నాయి.
  ఆచారకాండలోని అధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ, పదార్థతత్త్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.

  పరుల సొమ్ము పై ఆశ పడటం, ఇతరులు ఆస్తి ( సంపద, డబ్బు, భూమి, ఇల్లు , ఆభరణాలు ) వంటి దోపిడీ చేసి స్వాధీన పరుచుకోవడం
  భాగస్వాములతో గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలకు, తమ ఆనందం కోసం వేరోక వ్యక్తితో భాగస్వామ్యం లో ఉంటూ అక్రమ సంబందాలు పెట్టుకోవడం, భార్య భర్తలు విడాకులు తీసుకోవడం

  అమాయక ప్రజలను మోసం చేసి వారి ఆస్తులను స్వాధీన పరుచుకోవడం.

  step3
  ఎలుకలతో చంపటం: అపరిచితుడు సినిమాలో జలగలను శరీరంపై వదిలి నేరం చేసినవాడిని హీరో హింసిస్తాడు గుర్తుందా. ఇది కూడా అలాంటిదే. నేరానికి పాల్పడ్డ వారి శరీరానికి ఒక పంజరం లాంటి దానిని అమర్చి, బయటనుండి పెద్ద మంటను పెడతారు. ఆ పంజరంలో కొన్ని ఎలుకలను వదులుతారు. బయటనుండి వచ్చే వేడికి లోపలున్న ఎలుకలు తట్టుకోలేక ఎదుటఉన్న వారిపై రక్కడం మొదలుపెడతాయి. కొన్నేళ్ళ క్రితం ఈ శిక్షను ఎక్కువగా అమలుచేసేవారు. ఇంకా కొన్ని చోట్ల నేరస్తుల నుండి నిజం రాబట్టేందుకు ఇలాంటి కటిన శిక్షలు విధిస్తున్నారు.

  step4
  మనం తినే వస్తువులు కొంచెం వేడిగా ఉన్న తట్టుకోలేం. అలాంటిది సల సలకాగే నీటిలో లేదా నూనెను బాగా మరిగించి అందులో తప్పు చేసిన వాళ్ళను వేయించేవారు.

  syep5
  ఆనందం కోసం జంతువులను చంపడం, మూగ జీవులని హింసించడం

  step6

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *