• చంద్రబాబును తన పార్టీ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేశాడు

  Published October 8,2017 , 12:12 PM Posted By andhra

  చంద్రబాబును తన పార్టీ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేశాడు

  ఏపీ సీఎంను తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే  బ్లాక్ మెయిల్ చేశాడు. తనపై ఎక్కువ భారం పెట్టినా తనను ఇబ్బంది పెట్టినా పదవికి రాజీనామా చేస్తానని సదరు ఎమ్మెల్యేలను  బెదిరించి భయపెట్టి రాజకీయాల్లోకి దిగాడు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి రావెల కిషోర్బాబు ఎంత కాంట్రవర్సీకింగ్   చెప్పనవసరం లేదు.

  మంత్రిగా ఉన్న  మూడు సంవత్సరాలలో అతనితోపాటు తన కుమారుడిపై ఎన్నో వివాదాలు వినిపించాయి. అయితే రావెల ప్రవర్తన మాత్రం మారలేదు. మంత్రి పదవి పోయినా రావెల కాంట్రవర్సీ వ్యవహారాలను అదేవిధంగా చూసుకుంటున్నాడు.

  ఆయన పదవి పోయాక బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలుసుకొని టిడిపి పార్టీ యొక్క పగ్గాలు తనకివ్వాలని బాబుకు తెలియపరిచారు. మందకృష్ణ మాదిగకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు, వైసిపి లోకి వెళ్లడానికి పార్టీ నేతలతో సమావేశం జరిపాడని చంద్రబాబుకు తెలుసు అని అంటున్నారు.

  ఇక మాదిగ రిజర్వేషన్ల పై రావెల కట్టుదిట్టంగా మాట్లాడుతున్నాడు. మాదిగ రిజర్వేషన్ ల కోసం చంద్రబాబు గట్టిగా ప్రయత్నించాలని తెలియజేశాడు.మంద కృష్ణను సపోర్టు చేసి, గుర్రం జాషువా విగ్రహ ఆవిష్కరణ సమావేశంలో యాదవుల గురించి మాట్లాడారు.

  ఇక  మాలలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, మాదిగలు అసంతృప్తిని  వ్యక్తం చేస్తున్నారని, ఇలా ఉంటే చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారూ, అని మందకృష్ణ మాదిగను పదేపదే పత్తిపాడు నియోజకవర్గంలోకి పిలవడానికి టిడిపి నాయకులు అంగీకరించలేకపోతున్నారు. ఇటీవల రావెల మాటలకు టిడిపి నాయకుడు వర్ల రామయ్య గట్టిగా కౌంటర్ ఇచ్చాడు పలువురు నాయకులు టిడిపి నాయకులు రావెలను టార్గెట్ చేస్తున్నారట .

  రావెల వ్యాఖ్యలను త్రిప్పికొట్టాలని, బాబుపై తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని తెలుస్తోంది. తనపై అనవసరంగా టిడిపి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఇలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలియపరిచారు.

  రావెల ఇప్పుడు రాజీనామా చేస్తే చంద్రబాబుకు ఒక పెద్ద సమస్య వస్తుందని రావెల వైసిపికి వెళ్లవచ్చునని అనుకుంటున్నాడు, ఇక్కడ ఉప ఎన్నికలకు పెద్ద సవాల్ గామారుతుంది అని తెలిపారు. ఏది ఏమైనా రావెల యొక్క బ్లాక్ మెయిలు చంద్రబాబు పక్షాన బాగా పనిచేస్తుంది.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *