• జైలు నుంచి బయట కొచ్చిన చిన్నమ్మ దేవి శశికళ

  Published October 8,2017 , 12:59 PM Posted By andhra

  జైలు నుంచి బయట కొచ్చిన చిన్నమ్మ దేవి శశికళ

  కొన్ని దినాల నుంచి తమిళనాడు రాజకీయం లో జరుగుతున్న సమస్యలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.

  మన దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు నుంచి ప్రారంభమైన ఈ రాజకీయ క్రీడ ఆమె చనిపోయిన తర్వాత కూడా కొనసాగుతుంది. అమ్మకు ఎంతగానో నమ్మిన బంటుగా ఉంటున్నా పన్నీర్ సెల్వం మరియు శశికళ మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది, అదియే కాక తమిళనాడు సీఎం కుర్చీ కోసం చెన్నమ్మ ఎంతగా రాజకీయం చేసిందో మనందరికీ తెలుసు.

  అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనుభవింతు, తన భర్త ఆరోగ్యం బాగాలేదని ఆయన చూడడానికి అనుమతి కోరారు. శశికళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై శశికళకు పెరోల్ మంజూరైంది, కేవలం భర్తను చూడడానికి మాత్రమే అనుమతి ఉందని రాజకీయ సమావేశాలు నిర్ణయించరాదని కోర్టు ఆదేశించింది. ఒకవేళ చెప్పిన మాట వినకపోతే పెరోల్  ను  రద్దు చేస్తామని జైలు శాఖ హెచ్చరించారు.  మీడియా ప్రకటన కూడా చేయకూడదని తెలిపింది.

  బంధువుల ఇంట్లో ఉండాలని 15 రోజులు పెరోల్ ఇవ్వడం కుదరదని అని, కేవలం 5 రోజులు మాత్రమే బెయిలు మంజూరు చేశారని బెంగళూరు నుంచి నేరుగా చెన్నైకి శశికళ వెళ్తుందని తెలిపారు. మరొకవైపు శశికళ మేనల్లుడు దినకరన్ తన అత్త అయిన శశికళ వస్తున్న విషయం తెలుసుకొని తన మద్దతు దారులను తీసుకుని జైలు వద్దకు శుక్రవారం చేరుకున్నాడు. శశికళతో పాటు అన్నాడీఎంకే నాయకులపై తమిళనాడు ప్రభుత్వo  నిఘా పెట్టింది అని తెలియజేశారు, ఎలాగైనా శశికళ బయటకు రావడంతో గ్రాండ్ గా  స్వాగతం పలికారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *