• బాలకృష్ణ పై ఆగ్రహం రేపుతున్న టిడిపి నాయకులు

  Published October 8,2017 , 12:37 PM Posted By andhra

  బాలకృష్ణ పై ఆగ్రహం రేపుతున్న టిడిపి నాయకులు

  ఇంతకు ముందు టిడిపి కార్యకర్త మీద నందమూరి బాలయ్య చేయి చేసుకున్న  విషయం గురించి ప్రపంచ మంతా తెలిసిందే. లోకల్ మీడియా పట్టించుకోకపోయినా, నేషనల్ చానల్స్ లోమాత్రం  బాలయ్య చేసిన పని మోతమారు మ్రోగుతోంది.

  అభిమానుల మీద చుట్టు ప్రక్కల ఉన్న పార్టీ కార్యకర్తల మీద బాలకృష్ణ తనకు ఇష్టం వచ్చినట్లు చేయ్యి చేసుకోవడం అనేది కొత్త విషయం కాదు. 5, 6 సంవత్సరాలుగా టిడిపి నాయకత్వం లోకి వచ్చిన బాలకృష్ణ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ప్రవర్తన బయటచాలా దురుసుగా ఉంటుందని సోషల్ మీడియాలో టాకింగ్.

  తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న అభిమానిని బాలకృష్ణ కొట్టినట్లు వైరల్ అయింది. సినిమా పరిశ్రమలో తన పంచ్ డైలాగ్స్ తో  వేడెక్కించే బాలయ్య , అభిమానులు మీద సహనం కోల్పోయి చేయి చేసుకోవడం పార్టీకే చెడు ప్రభావాన్ని చూపుతుందని టిడిపి నాయకులు తెలిపారు.

  బాలకృష్ణ అంటే అభిమానం ఉన్న వాళ్లు పూల దండ వేయడానికి, సెల్ఫీ దిగడానికో, వారి కష్టాన్ని చెప్పుకోవటానికో  వస్తే వారి మీద దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు అని చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరగా చంద్రబాబు కూడా ఈ విషయం గురించి తెలుగు సోదరులు కంప్లైంట్ కూడా ఇచ్చేలా ఉన్నారు అని తెలియపరిచారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *