• మెంతులు వలన కలుగు ప్రయోజనాలు మీకు తెలుసా

  Published September 30,2017 , 12:49 PM Posted By andhra

  మెంతులు వలన కలుగు ప్రయోజనాలు మీకు తెలుసా

  మెంతులు ఉపయోగించని వంటల్లో ఏవీ ఉండవు. అన్ని రకాల పదార్థాలలో మెంతులు వాడతారు. వంటిల్లె కాదండి మన జుట్టుకు కూడా మెంతులు చక్కగా ఉపయోగపడతాయి.

  అదిఎలాగో చూద్దామా

  మెంతులు ఒక కప్పు తీసుకుని నీటిలో నానబెట్టి అరగంటయ్యాక మెత్తటి పేస్ట్ చేసుకుని, ఒక కప్పు పెరుగుతో కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది.జుట్టు గట్టిగా మృదువుగా ఉంటాయి. మెంతులలో మాంసకృతులు ఎక్కువగా ఉండడం ద్వారా జుట్టురాలిపోకుండా వుంటుంది జుట్టు చివర్లు చిట్లకుండా అవుతుంది. చుండ్రుని నివారించడంలో మెంతుల్లోని పోషకాలు పనిచేస్తాయి. గుప్పెడు మెంతులు రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు పేస్ట్ చేసుకొని, దానికి చెంచానిమ్మరసం కలిపి జుట్టుకు రాయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య నుండి భయటపడతారు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో దోహదపడతాయి. ఒక గుప్పెడు మెంతులు నానబెట్టిన తర్వాత వాటిని తీసుకొని కరివేపాకు కొద్దిగ వేసి ముద్దలా చేసి తర్వాత తలకు పట్టిస్తే గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఒత్తుగా నల్లగా ఉంటాయి.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *