• రాజు గారి గది 2 సూపర్ హిట్

    Published October 13,2017 , 5:00 PM Posted By andhra

    రాజు గారి గది 2 సూపర్ హిట్

    రాజుగారి గది- 2 అంటేనే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. దానికి తోడు దీనిలో నటించేవారు నాగార్జున, సమంతాల కాంబినేషన్ అని అనుకుంటే ఆ సినిమా ఎలా ఉంటుందో తెలుసు కోవచ్చు. దీనికితోడు ఓంకార్ డైరెక్షన్, దీని మీద ప్రజలకు ఒక నమ్మకం. నాగార్జున తన జీవితంలో ఎక్కువ సమయం కేటాయించింది. ఈ చిత్రానికి అని చెప్పవచ్చు ఈ సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో రెండవ పార్టు మీద ఆసక్తి చూపారట.

    ఈ నెల 13న ఈ సినిమా రాబోతోందని తాజాగావెల్లడి పరిచారు. మొదటి భాగంలో స్నేహితులు ఒక సముద్రం దగ్గర రిసార్ట్ లో కలుసుకుని సరదాగా గడుపుదాం అనే సమయానికి ఒక దెయ్యం ఉన్నట్లు అనిపించడం, ఆ దయ్యాన్ని పట్టుకోవడానికి ఒక మెంటల్ డాక్టర్ని పరిచయం చేయడం, ఆ ప్రాంతంలో ఉన్న ఒక చర్చి ఫాదర్ ఈ విషయాన్ని చూసుకునేవాడు.

    ఈ రి సార్ట్ లో ఉన్న ఆత్మ యొక్క జీవిత చరిత్రను ఎలా బయట పెట్టాలో ఒక వ్యక్తి తెలియపరిచాడు .దీనిలో మొదటి భాగం మొత్తం కామెడీ అని తరువాత భాగం కొంచెం బిజీ విజువల్ ఎఫెక్ట్తో తో ఎమోషన్స్ సీన్లు కూడా ఉన్నాయని అంటున్నారు.
    ఈ దయ్యానికి జీవిత చరిత్రలో అన్యాయం జరిగిందని తెలిసి ఆ ఆత్మ పాత్రకు సమంతను ఏర్పటుచేయడం దీనిలో సంమత ఆశ్చర్యంగా అద్భుతంగా చేసిందని కొన్ని వర్గాల వారు సమాచారం ఇస్తున్నారు.