• షాకింగ్ : గంజాయి కేసులో సినీ హీరో రవితేజ

  Published October 5,2017 , 5:09 PM Posted By andhra

  షాకింగ్ : గంజాయి కేసులో సినీ హీరో రవితేజ

  మొన్నటిదాక డ్రగ్స్ హాట్ టాపిక్ మరి ఇప్పుడు గంజాయి టాలీవుడ్ వదలడం లేదు. ఏమైనా టాలీవుడ్ ని మాత్రం మత్తు విడిచి పెట్టడం లేదు. డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పోలీసులు చాలా మందిని విచారణ చేశారు. కదా వారిలో కొంతమంది టాలీవుడ్ హీరోలు ఉన్నారు. సుమారుగా 14 మందిని ఈ కేసులో విచారించగా ఒక్కసారిగా సినీ ప్రపంచం అంతా ఆశ్చర్య పోయింది. ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయని వణికిపోయింది. ఇప్పుడు మరలా టాలీవుడ్లో ఉన్న ముఖ్యమైన ప్రముఖులను కర్ణాటక పోలీసులు కూడా విచారించ బోతున్నారు. ఏంటి అని ఆశ్చర్యపోకండి, ఇటీవల కాలంలో కారు యాక్సిడెంట్లో కేసులో అనుకోని విధంగా గంజాయి బయటపడింది. దీనితో టాలీవుడ్ డొంకంతా కదిలింది.

  రెండు రోజుల ముందు టిడిపి మాజీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు మనవడు బెంగుళూరులో కారు యాక్సిడెంట్ చేశాడు. పోలీసులు అక్కడకు రావడంతో సీన్ రివర్స్ అయ్యింది. కారులో ఎక్కువ మోతాదులో గంజాయి దొరకడం వలన పోలీసులు ఆయన్ను విచారించారు,ఈ విచారణలో ఆదికేశవ నాయుడు మనవడు గీతా విష్ణు కొన్ని విషయాలు తెలియజేశారు. ఆ విషయాలు బయటకు రావడంతో సినీ పరిశ్రమలో అందరూ కంగు తిన్నారు. ఎందుకంటే ఆ గంజాయి సరఫరా రవితేజ చేస్తారని పోలీసు విచారణలో తేలింది. ఇంతకు ముందు కూడా కొన్ని సార్లు తనకు అవసరమైన గంజాయిని రవితేజ పంపించేవారని తెలియజేశారు. ఈ గంజాయి స్మగ్లింగ్ రవితేజ పేరు బయటకు రావడంతో టాలీవుడ్ అంతా ఉలిక్కి పడింది.

  గతంలో కొన్ని సార్లు రవితేజ యొక్క సోదరుల పేర్లు కేసులో బయటకు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా రవితేజ పేరు రాలేదు. అయినా తెలంగాణలో అధికారులు రవితేజను డ్రగ్స్ కేసులో విచారించారు. ఇప్పుడు మళ్లీ గంజాయి కేసులో కర్నాటక పోలీసులు గీతా విష్ణు చెప్పిన విషయాలను బట్టి రవితేజను విచారించ బోతున్నారని సమాచారం. ఎప్పుడైనా హైదరాబాదుకు వచ్చి రవితేజ ను విచారించవచ్చు అని చెబుతున్నారు.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *