• స్పైడర్ పై నిరుత్సాహం

    Published October 13,2017 , 4:37 PM Posted By andhra

    స్పైడర్ పై నిరుత్సాహం

    మురగదాస్ కాంబినేషన్ లో మన ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ గా తీసిన చిత్రం స్పైడర్. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రిలీజైన, ఈ చిత్రం రెండు భాషల్లో ఫ్లాప్ అయ్యింది. ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి కూడా ఈ సినిమా నత్త నడక తో ముందుకు సాగుతూ వచ్చిందట దానికి తగ్గట్టు షూటింగ్ కూడా ఆలస్యం అయిందని తెలిపారు.

    అయితే అభిమానులు మాత్రం మహేష్ సినిమా అంటేనే పెద్ద పెద్దగా గోల గోల చేసే వాళ్లు, అయితే ఏమైందో తెలియదు కానీ అభిమానులు థియేటర్లలో సినిమా చూసిన తరువాత నీరు కారిపోయారు.

    నేటి మన నిజజీవితంలో జరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని తనస్టైల్లో ఈ సినిమా చేశాడు దర్శకుడు. కానీ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లేదని తెలిపారు. అత్యంత భారీ ఎత్తున విడుదల అయినా ఈ సినిమా మొదట్లోనే ఫ్లాప్ అయిoది అని తెలియడంతో కలెక్షన్లని పూర్తిగా తగ్గిపోయాయి. దాని వల్ల తెలుగులోనే ఫ్లాప్ అయిన, తమిళంలో అన్నా హిట్ అయ్యే అవకాశం ఉంది అని ఆశపడ్డారు, కానీ తగిన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

    అయితే పది కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మిగతా ఐదు కోట్లకు షేర్ వస్తే బాగుండేది అని అనుకున్నారు కానీ అవకాశం లేదట, మొత్తానికి ఎంతగానో ఆశలు పెట్టుకున్నా స్పైడర్ ఫ్లాప్ అవ్వడంతో మహేష్ తో పాటు అభిమానులు కూడా నిరుత్సాహ పడ్డారు.